
నీ పేరే ప్రేమైతే,
నా పేరే నీవైతే
నువ్వంటూ లేకుంటే
నేనంటూ లేనంతే...!
గతమంతా నీ గురుతే
భవితంతా నీ కొరకే
నీ తోడే లేకుంటే
చావు బ్రతుకోకటే...
నిన్న మొన్నల ఆ కలలు
వదలను నేను ఏ నాడు
కలలో నువ్వే ఉన్నావంటే
నిజమే వద్దులే…….!
ఎదురుగ లేవే ఈనాడు,
ఎద ఎరుగదులే ఆ ఊసు ,
ఎదురేఉన్నా, ఎక్కడఉన్నా
నీతో ఉందిలే ...
నీలో చేరి నేను
మరిచా నన్ను నేను
నీలో నన్ను చూసే
ఓ వింతను కనుగొన్నా ...
నిన్నే కోరుకున్నా
నీ కోసం వేచి ఉన్నా
నిదురంటూ లేని రాత్రులేవో
నాకు తోడై నిలిచెనా...!
హృదయాన నువ్వలా
ఉదయానివై ఇలా
ఒక సారి నన్ను చేరుకుంటే
చింతే లేదుగా ......
మదిలోన వేదనా
ఒదిగుండనందిగా
ఓదార్పు చూపే వరమై వస్తే
అంతే చాలుగా ...!

నీతో, ఇన్ని నాళ్ళు
ఎన్నో, జ్ఞాపకాలు
మారుపే రాక నాలో
మైమరపే నింపేనా.......
అడుగే సాగనంది,
పయనం తెలియదంది,
నీ పాదం వెంట నడిచే
అలవాటే ఆగునా…………
నువ్వు చెప్పేటి, ఊసుల
జాడైన లేకనే
ఊరుకోక ,ఒసూరుమందే
ప్రాణం ఏంటిలా ....
సెలయేటి నవ్వుల
తడి చెమ్మ లేకనే
ఎడబాటులోన ఎడారి దారే ఏవైపు చూసినా....
నీ పేరే ప్రేమైతే,
నా పేరే నీవైతే
నువ్వంటూ లేకుంటే
నేనంటూ లేనంతే...! kave(కv)
వేదనంత వేర్రిదేరా.
స్వార్దేమేర అసలు తీరా..
మనిషి బ్రతుకే మహా నాటకం ,
పాత్రలన్ని వట్టి బూటకం
స్వారమేలే అసలు కధనం..
మనిషినంటు చెప్పుకుంటూ ,
మోసగిస్తూ మోసపోతూ ,
మనస్సాక్షికి చితిని పేర్చి
ఎవరిని ఎమార్చే పిచ్చి నీది ..
మోసపోకు ఓ మనిషి.
మేలుకోర ఓ మనిషి.....
చెవులు ఎన్నడు నిజం వినవు,
కనులు ఎన్నడు నిజం కనవు,
నాలుకేన్నాడు నిజం పలుకదు,
నిజం తెలుసుకో ఓ మనిషి,
తెలుసుకున్టేనే నువ్వు మనిషి ...........
నిన్న రేపుల చిక్కులోన
నేడు మిగిలని లెక్క నీది
భయం చాటున బ్రతుకు నీది
రోజు మారే నీతి నీది ..
వేదనంత వేర్రిదేరా.
స్వార్దేమేర అసలు తీరా.. KAVE (కV)
నాదనే మాటనే లేదులే నాకే నాడు..
నీవనే నేనులో కలసి పోయా నేడు..
మనసే నీకై పాడింది ఈ పాట..
కడలికై సాగే నది లాంటిది నా బాట ...
దూరమంతా భారామాయే గుండెకే గాయం చేసే,
కాలమేదో నేస్తమయ్యి కలతలే మాపేన....!
పంచదార చిలుక కోసం గోరింక ఆరాటాలు ,
లోకమంతా కుదరదంటు కత్తులే దూసేనా ...!
పొంగింది గంగేదో కన్నీరై పొంగిందీ..
కోరింది నా హృదయం ఓదార్పే కోరింది...!
నాదనే మాటనే, లేదులె నాకే నాడు..
నీవనే నేనులో కలసి పోయా నేడు..
మౌనమేలే మనసు భాష ..
నీ చెలిమికై నిలిచిందీ శ్వాస ...!
నా వర్ణం ఏదో చెప్పమంటే
ప్రేమకే తెలిసేనా ...!
అలసింది సోలసింది ఎద కోతే పెరిగింది ...
కరిగింది మిగిలింది చిగురాశే మిగిలింది ....!
నాదనే మాటనే లేదులే నాకే నాడు..
నీవనే నేనులో కలసి పోయా నేడు..
-KAVE (కV)