Tuesday, April 16, 2013

నీ పేరే ప్రేమైతే....

నీ పేరే ప్రేమైతే,
నా పేరే నీవైతే
నువ్వంటూ లేకుంటే
నేనంటూ లేనంతే...!

గతమంతా నీ గురుతే
భవితంతా  నీ కొరకే
నీ తోడే లేకుంటే
చావు బ్రతుకోకటే...





నిన్న మొన్నల  కలలు
వదలను నేను  నాడు
కలలో నువ్వే ఉన్నావంటే
నిజమే వద్దులే…….!
ఎదురుగ లేవే ఈనాడు,
ఎద ఎరుగదులే  ఊసు ,
ఎదురేఉన్నా, ఎక్కడఉన్నా
నీతో  ఉందిలే ...

నీలో చేరి నేను
మరిచా నన్ను నేను
నీలో నన్ను చూసే
 వింతను కనుగొన్నా ...


నిన్నే కోరుకున్నా 
నీ కోసం వేచి ఉన్నా
నిదురంటూ లేని రాత్రులేవో
నాకు తోడై  నిలిచెనా...!
హృదయాన నువ్వలా
ఉదయానివై ఇలా
ఒక సారి నన్ను చేరుకుంటే
చింతే లేదుగా ......
మదిలోన వేదనా
ఒదిగుండనందిగా
ఓదార్పు చూపే వరమై వస్తే
అంతే చాలుగా ...!






నీతో, ఇన్ని నాళ్ళు
ఎన్నో, జ్ఞాపకాలు
మారుపే రాక నాలో
మైమరపే నింపేనా.......

అడుగే సాగనంది,
పయనం తెలియదంది,
నీ పాదం వెంట నడిచే
అలవాటే ఆగునా…………

నువ్వు చెప్పేటి, ఊసుల
జాడైన లేకనే
ఊరుకోక ,ఒసూరుమందే
ప్రాణం ఏంటిలా ....

సెలయేటి నవ్వుల
తడి చెమ్మ లేకనే
ఎడబాటులోన ఎడారి దారే ఏవైపు చూసినా....


నీ పేరే ప్రేమైతే,
నా పేరే నీవైతే  
నువ్వంటూ లేకుంటే
నేనంటూ లేనంతే...!                                       kave(కv)

No comments:

Post a Comment