Tuesday, April 16, 2013

నీకై నేను .....

నాదనే  మాటనే  లేదులే  నాకే నాడు..
నీవనే  నేనులో కలసి పోయా నేడు..

మనసే నీకై పాడింది ఈ పాట..
కడలికై సాగే  నది లాంటిది నా బాట ...





దూరమంతా భారామాయే  గుండెకే గాయం చేసే,
కాలమేదో నేస్తమయ్యి కలతలే  మాపేన....!
పంచదార చిలుక కోసం గోరింక ఆరాటాలు ,
లోకమంతా కుదరదంటు కత్తులే  దూసేనా ...!


పొంగింది గంగేదో  కన్నీరై పొంగిందీ..
కోరింది నా హృదయం ఓదార్పే కోరింది...!


నాదనే  మాటనే,  లేదులె నాకే నాడు..
నీవనే  నేనులో కలసి పోయా నేడు..


మౌనమేలే మనసు భాష ..
నీ చెలిమికై నిలిచిందీ  శ్వాస ...!
నా వర్ణం ఏదో చెప్పమంటే
ప్రేమకే తెలిసేనా ...!

అలసింది సోలసింది ఎద కోతే పెరిగింది ...
కరిగింది మిగిలింది చిగురాశే  మిగిలింది ....!   


నాదనే  మాటనే  లేదులే  నాకే నాడు..
నీవనే  నేనులో కలసి పోయా నేడు..




-KAVE  (కV)

No comments:

Post a Comment