ఎంకన్నకే తెలుసు నా వేదనా
మహాలక్ష్మి జత లేని ఆవేదన..
శిలలాగ మిగిలాడు ఆ కొండన,
చిరునవ్వే కరువాయే ఆ మోమున ..
లోకాన బాదలన్ని తీర్చేటి సామికి ,
ఆ మనసున దాగుంది తెలిసేది ఎందరికి .....!
రాములోరికే తెలుసు నా యాతనా
సీతమ్మ లేకున్టే సంతోషముండునా ..
మనసున్న మారాజుకి ,మనసంతా భారమే ,
ప్రేమ పంచే ప్రభువుకి, పయనం అడివాయనే ..,
జాడతెలియక పడ్డ రామయ్య కష్టం,
జానకమ్మకి తప్ప ఇంకెవరికి ఎరుక ....!
మహాలక్ష్మి జత లేని ఆవేదన..
శిలలాగ మిగిలాడు ఆ కొండన,
చిరునవ్వే కరువాయే ఆ మోమున ..
లోకాన బాదలన్ని తీర్చేటి సామికి ,
ఆ మనసున దాగుంది తెలిసేది ఎందరికి .....!
రాములోరికే తెలుసు నా యాతనా
సీతమ్మ లేకున్టే సంతోషముండునా ..
మనసున్న మారాజుకి ,మనసంతా భారమే ,
ప్రేమ పంచే ప్రభువుకి, పయనం అడివాయనే ..,
జాడతెలియక పడ్డ రామయ్య కష్టం,
జానకమ్మకి తప్ప ఇంకెవరికి ఎరుక ....!






