Saturday, August 23, 2014

జ్ఞాపకాలు గాయాలే ఏనాటికైనా .....

జ్ఞాపకాలు గాయాలే ఏనాటికైనా....  
కాలం ప్రేయసి ఐతే  
కలం ప్రేమికుడి నేస్తం...

అగ్నికి కలలన్నీ ఆహుతైతే ,
ఏడడుగులతో ఏడుజన్మల దూరం పెరిగితే 
మూడు ముళ్ళ చిక్కుల్లో మనసులు నలిగితే 
జ్ఞాపకాలు గాయాలే  ఏనాటికైనా  ,,,

సంద్రానికి అలలతో ఉన్న అనుబంధం నాది నీది 
నీ పరుగు ఆగదు రాతిరి పగలు,
నా ఎదురు చూపు నిశిరాతిరి ఉషోదయాల కలగలుపు 
జ్ఞాపకాలు గాయాలే ఏనాటికైనా  ,,,

ఒకరికొకరిని మొదలైన కథ 
ఎవరికెవరని ఆగిపోతే 
కంచికి బయలుదేరిన బాటసారికి 
జ్ఞాపకాలు గాయాలే  ఏనాటికైనా  ,,,

కాలం ప్రేయసి ఐతే  
కలం ప్రేమికుడి నేస్తం
కన్నీటి సిరా తో రాసిన ప్రతి అక్షరం 
కంటికి కనపడని ప్రేమలా వ్యర్ధం 
మిగిలిన జ్ఞాపకాలు మాత్రం గాయాలే ఏనాటికైనా  ,,,

KaVe

No comments:

Post a Comment