Sunday, August 24, 2014

నడిచా నీ ఊహలే శ్వాసగా ...


 నడిచా నీ ఊహలే శ్వాసగా ..
నడిచా నీ తలపులే తోడుగా...

దూరం ఎన్నడు తెలియదే నాకు ,నీ కోసమే నేను నడిచా..
అలుపంటూ ఆగనేలేదేనాడు , నీ కోసమే నేను నడిచా ...

చలి దారుల్లోన నడిచా 
మంచుదారుల్లోన నడిచా 
మంచు ముత్యం లాంటి నీ మనసే నాకు తోడుగా ..!

కొండకోనల్లోన నడిచా
జడివానల్లోన తడిచా
నే ఆకలిదప్పులు మరిచా ఈ ప్రేమ సాక్షిగా ...!

నా దారే ఏ వైపుకో అన్న ప్రశ్నే లేదేమిటో,
గమ్యం నీవు ఇతే నా ప్రాణం పయనం అంది...!

వడగాలుల్లోన నడిచా 
వేసవి బాటల్లోన నడిచా 
నీ ఎడబాటుల్లోన  వగచా 
నేను వెర్రిగా ....!

చిమ్మ చీకట్లోన నడిచా ,
నిశిరాత్రుల్లోన నడిచా ,
నీ చిరునవ్వే నా చిరుదివ్వై నాకు తోచగా..!

తీరం ఏనాటికో అన్న ప్రశ్నే లేదేమిటో 
గమ్యం నీవు ఇతే ,
నా ప్రాణం పయనం అంది.....!

KaVe
.........................................................................................................................
 




    




    

No comments:

Post a Comment