Sunday, August 24, 2014

ఎంకన్నకే తెలుసు నా వేదనా...

ఎంకన్నకే తెలుసు నా వేదనా
మహాలక్ష్మి జత లేని ఆవేదన..
శిలలాగ మిగిలాడు ఆ కొండన,
చిరునవ్వే కరువాయే ఆ మోమున  ..
లోకాన బాదలన్ని తీర్చేటి సామికి ,
ఆ  మనసున దాగుంది తెలిసేది ఎందరికి .....!

రాములోరికే తెలుసు నా యాతనా
సీతమ్మ లేకున్టే సంతోషముండునా ..
మనసున్న మారాజుకి ,మనసంతా భారమే ,
ప్రేమ పంచే ప్రభువుకి, పయనం అడివాయనే ..,
జాడతెలియక  పడ్డ రామయ్య కష్టం,
జానకమ్మకి  తప్ప ఇంకెవరికి ఎరుక ....!
 

No comments:

Post a Comment